స్థానికత విధివిధానాలు ఇవే..

స్థానికత విధివిధానాలు ఇవే..

తెలంగాణలో స్థానికతకు పెద్దపీట వేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇకపై 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదివిన ప్రదేశాన్ని బట్టి స్థానికతను పరిగణించనున్నారు. ఈమేరకు మంత్రి వర్గ ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అలాగే.. ఇప్పటి వరకు  రెండు జోన్లుగా ఉన్న రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా మార్చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. మల్టీజోనల్‌ విధానాన్ని కూడా రద్దు చేసి ఆ పోస్టులన్నింటినీ స్టేట్‌ కేడర్‌లోకి బదలాయించనున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటుచేసిన 31 జిల్లాలకు అనుగుణంగా కొత్త జోనల్ వ్యవస్థ ఉంటుంది.  తాజాగా 4 జోన్ల ఏర్పాటుతో జోన్‌-1లోకి 9 జిల్లాలను, జోన్‌-2లో 11 జిల్లాలు, జోన్‌-3 లో 3 జిల్లాలు, జోన్‌-4లో 8 జిల్లాలను చేర్చారు. ప్రతిపాదిత జోనల్‌ విధానంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాక సవరణలను ఆమోదించే అవకాశం ఉంది.