ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ప్రమాదం: విషవాయువుల ప్రభావం నుంచి బయటపడాలంటే... !!

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ప్రమాదం: విషవాయువుల ప్రభావం నుంచి బయటపడాలంటే... !!

ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ఈ ఉదయం గ్యాస్ లీక్ కావడం ప్రమాదం జరిగింది.  గ్యాస్ భారీ ఎత్తున లీక్ కావడంతో దాని ప్రభావం ఐదు గ్రామాలపై పడిన సంగతి తెలిసిందే.  ఈ గ్యాస్ ను పీల్చిన ప్రజలు సృహతప్పి పడిపోయారు.  కళ్ళు మంటలు, వాంతులు కావడం, ఒంటిపై దద్దుర్లు రావడం వంటివి ఈ స్టెరిన్ గ్యాస్ లక్షణాలుగా నిపుణులు చెప్తున్నారు.  

ఈ వాయువుల నుంచి బయటపడాలి అంటే కళ్ళు, శరీరాన్ని సబ్బు నీటితో కడుక్కోవాలి.  తడి గుడ్డని మాస్క్ లా కట్టుకోవాలి.  శరీరం నీరసంగా ఉంటె సిట్రిజన్ మాత్రను వేసుకోవాలి.  ఎక్కువగా నీళ్లు తాగాలి.  అదే విధంగా పాలు తాగితే కూడా విషవాయువుల ప్రభావం నుంచి బయటపడొచ్చు.  విషవాయువులు పీల్చిన వ్యక్తులను వీలైనంత త్వరగా హాస్పిటల్ కు తరలించి వైద్యం అందేలా చూడాలి.  ఆక్సిజన్ అందించగలిగితే ప్రమాదం నుంచి బయటపడొచ్చు.  విషవాయువు లక్షణాలు కనిపించిన వారి చుట్టూ గుమి కూడొద్దని, బాధితులకు వీలైనంత వరకు స్వచ్ఛమైన గాలి అందేలా చూడాలని నిపుణులు చెప్తున్నారు.