అమ్మో చిరుత..రాజేంద్రనగర్‌లో మరోసారి కలకలం

అమ్మో చిరుత..రాజేంద్రనగర్‌లో మరోసారి కలకలం

గత కోన్నిరోజులుగా తెలంగాణలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తుంది..హైదరాబాద్‌ పరిసరప్రాంతంలో, గనగ్‌పాడ్‌, ఆదిలాబాద్‌ జిల్లాలో,నల్గొండ జిల్లాలో చిరుత సంచారం కొద్ది రోజులుగా ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది....ఫారెస్ అధికారులు ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్న ఎండకాలం వేడి,ఆహారం దొరకకపోవడంతో వన్య జీవులు  జనారాణ్యంలోకి వస్తున్నాయి...తాజాగా మరోసారి రాజేంద్రనగర్‌లో చిరుత సంచారం మరోసారి కలకలం సృష్టించింది... ఇక్కడి జాతీయ వ్యవసాయ పరిశోధనా విస్తరణ సంస్థ సమీపంలోని ట్యాంక్‌ ఏరియాలో ఓ సీసీటీవీలో చిరుత సంచరించిన ఆనవాళ్లు రికార్డు అయ్యాయి...
గురువారం రాత్రి 8.30గంటల సమయంలో చిరుత అక్కడి నిర్మానుష్య ప్రాంతంలో సంచరించినట్లు అధికారులు గుర్తించారు... ఈ నెల 14న గగన్‌పహాడ్‌ సమీపంలో చిరుత సుమారు మూడు గంటలు సంచరించింది. అటవీశాఖ అధికారులు, పోలీసులు తీవ్రంగా శ్రమించినా ఆచూకీ కనుక్కోలేకపోయారు. ఓ స్థానికుడు హిమాయత్‌సాగర్‌లో నీరు తాగుతుండగా చూసినట్లు అధికారులకు చెప్పడంతో అక్కడా గాలించారు. గురువారం చిరుత సంచరించినట్లు సీసీటీవీలో రికార్డ్‌ కావడంతో ఆయా సంస్థల అధికారులు అప్రమత్తమయ్యారు..