నిఖిల్ స‌ర‌స‌న `అందాల రాక్ష‌సి`

నిఖిల్ స‌ర‌స‌న `అందాల రాక్ష‌సి`

నిఖిల్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `కిరాక్ పార్టీ` విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా త‌ర‌వాత ఈ యంగ్ హీరో `ముద్ర` అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. టి.ఎన్‌.సంతోష్ ఈ చిత్రానికి దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఠాగూర్ మ‌ధు నిర్మిస్తున్నారు. ఈ సినిమా త‌మిళ్‌లో తెర‌కెక్కిన ఓ హిట్ సినిమా `క‌నిధాన్‌`కి రీమేక్ అని ప్ర‌చార‌మ‌వుతోంది. అయితే సంతోష్ టీమ్ మాత్రం ఈ సినిమా రీమేక్ కాద‌ని వివ‌ర‌ణ ఇస్తోంది. ఇది కేవ‌లం `క‌నిధాన్‌` నుంచి స్ఫూర్తి పొంది తెర‌కెక్కిస్తున్న సినిమా.. తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్టు ఉంటుంద‌ని చెబుతున్నారు. 

ఈ సినిమాలో నిఖిల్ స‌ర‌స‌న నాయిక ఎవ‌రు? అన్న ప్ర‌శ్న‌కు తాజాగా స‌మాధానం ల‌భించింది. ఈ సినిమాలో అందాల రాక్ష‌సి ఫేం లావ‌ణ్య త్రిపాఠి క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. నిఖిల్‌- లావ‌ణ్య జోడీ తొలిసారి క‌లిసి న‌టించ‌నున్నారు. ఈ మంగ‌ళ‌వారం నుంచి లావ‌ణ్య సెట్స్‌కి ఎటెండ‌వుతుందిట‌. ముద్ర పూర్తిగా యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్ సినిమా. నిఖిల్ మార్క్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉంటుంద‌ని తెలుస్తోంది.