కొడుకు పెళ్లి కోసం లాలూకు పెరోల్...

కొడుకు పెళ్లి కోసం లాలూకు పెరోల్...

దాణా స్కామ్‌లో దోషిగా తేలి జైలు జీవితం గడుపుతున్న ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు పెరోల్ మంజూరైంది. తన పెద్ద కుమారుడి వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు లాలూప్రసాద్‌కు ఐదు రోజుల పెరోల్ మంజూరు చేశారు. రాంచీ ఎస్పీ, జార్ఖండ్ అడ్డకేట్ జనరల్ ఎలాంటి అభ్యంతరాలు లేవని సర్టిఫికేట్ ఇచ్చారని... రాంచీలోని రిమ్స్ ఆస్పత్రి ఇప్పటికే ఆర్జేడీ చీఫ్‌కు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇవ్వడంతో... ఈ రోజు సాయత్రం 5.55 గంటలకు రాంచీ నుంచి లాలూప్రసాద్, పాట్నాకు బయల్దేరి వెళ్తారని తెలిపారు ఆర్జేడీ నేత భోలా యాదవ్. 

ఈ నెల 9 తేదీ నుంచి 13వ తేదీ వరకు లాలూకు పెరోల్ మంజూరు చేయగా... లాలు కుమారుడు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్, ఐశ్వర్యరాయ్‌ వివాహం ఈ నెల 12వ తేదీన జరగనుంది. ఏప్రిల్ 18న పాట్నాలోని హోటల్ మౌర్యలో వైభంగా తేజ్ ప్రతాప్ - ఐశ్వర్యరాయ్ నిశ్చితార్థం జరగగా... ఆ వేడుకకు లాలూ మినహా కుటుంబ సభ్యులందరూ, స్నేహితులూ హాజరైన సంగతి తెలిసిందే.