ఐపీఎల్ చైనా స్పాన్సర్షిప్ ముగించాలి : KXIP 

ఐపీఎల్ చైనా స్పాన్సర్షిప్ ముగించాలి : KXIP 

తూర్పు లడఖ్‌లో హింసాత్మక ఘర్షణలో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)కు చైనా స్పాన్సర్షిప్ ను ముగించాలని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా పిలుపునిచ్చారు. జూన్ 15 న లడఖ్ యొక్క గాల్వన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో 21 మంది భారతీయ సైనికులు మరణించారు. అప్పటి నుండి ''బాయికాట్ చైనా'' అనే నినాదం భారత్ లో మారుమోగుతోంది. అయితే ఐపీఎల్ కు ''వివో'' అనే ఒక చైనా కంపెనీ స్పాన్సర్షిప్ చేస్తుంది. అందువల్ల ఆ స్పాన్సర్షిప్ ను తొలగించాలంటూ ప్రజలు బీసీసీఐ ని కోరారు. అయితే ఈ విషయం పై వాడియా మాట్లాడుతూ... ఎవరికైనా ముందు దేశం, డబ్బు అనేది  తర్వాత, అయితే మనది ఇండియన్ ప్రీమియర్ లీగ్ చైనీస్ ప్రీమియర్ లీగ్ కాదు. అందువల్ల చైనా స్పాన్సర్షిప్ ను ముగించాలి, పేటీఎం, స్విగ్గి, డ్రీం 11 వంటి ఇతర కంపెనీలు ఐపీఎల్ స్పాన్సర్షిప్ లో పాల్గొంటాయి అని వాడియా స్పష్టం చేయగా, చెన్నై సూపర్ కింగ్స్‌తో సహా ఇతర ఫ్రాంచైజ్ లు, బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకున్న దానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు.