88కే పంజాబ్ కథ ముగించిన బెంగళూరు

88కే పంజాబ్ కథ ముగించిన బెంగళూరు

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్ల ధాటికి పంజాబ్ 88కే కుప్పకూలింది. టాస్ గెలిచి పంజాబ్‌కు బ్యాటింగ్ అప్పగించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ నమ్మకాన్ని నిలబెడుతూ.. బెంగళూరు బౌలర్లు విజృంభించారు. వీరి పదునైన బంతులకు పంజాబ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది. కేవలం 15.1 ఓవర్లలో 88 పరుగులకే కింగ్స్ ఎలెవన్ కథ ముగిసింది. పంజాబ్‌లో బ్యాట్స్‌మెన్లలో ఫించ్ 26, రాహుల్ 21, గేల్ 18 పరుగులు చేయగా.. బెంగళూరు బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు.