కేసీఆర్‌ పేరుకు కేటీఆర్‌ కొత్త నిర్వచనం..KCR అంటే..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర మంత్రి కేసీఆర్‌ తనయుడు కేటీఆర్ కొత్త నిర్వచనం ఇచ్చారు..కేసీఆర్‌ అంటే..
K కాల్వలు
C చెరువులు
R రిజర్వాయర్లు పేరు సార్థకం కాగా..కేటీఆర్‌ కొత్త నిర్వచనం ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు...
ఈ రోజు మేడిగడ్డ నుండి కొండపోచమ్మ వరకు...82 మీటర్ల ఎత్తు నుండి 618 మీటర్ల ఎత్తు వరకు నీటి పంపు చేయడానికి మోటార్‌ స్విచ్‌ అన్‌ చేసిన కేసీఆర్‌కు తనయుడు కేటీఆర్‌ కొత్త నిర్వచనం ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకెళ్తున్నారు... ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చి.. రైతుల ముఖాల్లో సంతోషం నింపే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. గోదావరి, కృష్ణా జలాలను ఒడిసిపట్టి.. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే విధంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు కేసీఆర్... ఇందులో భాగంగా గోదావరి జలాలను ఒడిసి పట్టేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి.. ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నారు...

ఈ క్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌.. కేసీఆర్‌కు కొత్త నిర్వచనమిచ్చారు. కే అంటే కాల్వలు, సీ అంటే చెరువులు, ఆర్‌ అంటే రిజర్వాయర్లు అని కేటీఆర్‌ తెలిపారు. కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతుండటంతో కేసీఆర్‌ పేరు సార్థకమైందన్నారు‌...ప్రపంచంలోనే అతిపెద్ద బహుళార్ధ సాధక ప్రాజెక్టు కాళేశ్వరాన్ని యువ తెలంగాణ రాష్ర్టం.. కేవలం మూడేళ్లలోనే పూర్తి చేసింది అని కేటీఆర్ తెలిపారు. ..ఈ రిజర్వాయర్లు ద్వారా హైదరాబాద్‌ ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. దూరదృష్టితో భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడేవిధంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్న సీఎం కేసీఆర్‌కు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.