ఆదాయంలో కృష్ణా జిల్లా నెంబర్‌వన్..!!

ఆదాయంలో కృష్ణా జిల్లా నెంబర్‌వన్..!!

వచ్చే డిసెంబర్ నాటికి దేశంలో అధిక ఆదాయం ఉన్న జిల్లాల జాబితాలో కృష్ణాజిల్లా నెంబర్‌వన్ కాబోతోంది అన్నారు ఆ జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మచిలీపట్నంలో నిర్వహిస్తున్న బీచ్ ఫెస్టివల్‌‌కు సంబంధించిన వివరాలను తెలిపారు. ఈ నెల 9,10,11 తేదీల్లో జరిగే బీచ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 7వ తేదీన మచిలీపట్నంలో 2కె వాక్ నిర్వహిస్తున్నామని.. పర్యాటకుల కోసం హెలీ టూరిజాన్ని ఏర్పాటు చేశామన్నారు.. ఇందుకోసం ఒక్కో మనిషికి రూ.2500 ఛార్జీని నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు.

అలాగే బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డీ, గిన్నిస్ రికార్డు కోసం 100 అడుగుల దోశను తయారు చేయనున్నామన్నారు. బీచ్ ఫెస్టివల్‌తో అతిపురాతన నగరం బందర్ కొత్త రూపు దిద్దుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నుంచి కార్తీక మాసం వరకు జిల్లా వ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని లక్ష్మీకాంతం వెల్లడించారు.