ఈవీఎం కు కోన కొత్త అర్ధం

ఈవీఎం కు కోన కొత్త అర్ధం
కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.  ఫలితాలు ఎవరికీ అనుకూలంగా రాలేదు.  బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. అధికారం చేజిక్కించుకునే దిశగా అడుగులు వేయలేకపోయింది.  పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ ఆధిక్యంలో కొనసాగింది.  ఒకానొక దశలో బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధిస్తుందని అనుకున్నారు.  కానీ మధ్యాహ్నం తరువాత ఫలితాలు మారిపోయాయి.  ఏ పార్టీకి సంపూర్ణమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది.  
ఇదిలా ఉంటె, ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నప్పటి నుంచి ఈవీఎంలపై విమర్శలు వెలువడుతూనే ఉన్నాయి.  ఈవీఎం లను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.  బ్యాలెట్ ఓటింగ్ కు వెళ్లాలని, బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీ భయపడుతోందని విమర్శలు చేశారు.  ఇక సినీ రచయిత కోనా వెంకట్ ఈవీఎం మెషిన్ కు కొత్త అర్ధం చెప్పాడు.  "ఎప్పుడైతే కర్ణాటక ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం లను ఓపెన్ చేశారో.. అప్పుడే రిజల్ట్స్ ఈవీఎం (ఎవ్రీబడీ ఓటెడ్ ఫర్ మోదీ) అని తెలిసిపోయింది. నో కామెంట్స్' అని ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు.  కోనా వెంకట్ చేసిన ట్వీట్ పై నెటిజన్లు విమర్శనాస్త్రాలు సంధించారు.