మాకు గన్‌మెన్లను ఇవ్వాల్సిందే

మాకు గన్‌మెన్లను ఇవ్వాల్సిందే

తమ గన్‌మెన్లను పునరుద్ధరించాల్సిందేనని తెలంగాణ డీజీపీని కోరారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్. డీజీపీని కలిసిన ఇద్దరు నేతలు... మా ఇద్దరిని ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది... ఈ విషయాన్నే డీజీపీకి విరించామన్నారు కోమటిరెడ్డి. ప్రజాబలం లేని టీఆర్ఎస్ నేతలకు గన్‌మెన్లను ఇచ్చారు... మాకు కూడా ఇవ్వాల్సిందేనన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల విరేశం హత్య కేసుల్లో ఉన్నారని డీజీపీకి చెప్పినట్టు తెలిపారు కోమటిరెడ్డి. మాకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మా కార్యకర్తలు సంబరాలు చేసుకుంటే వారిపై కూడా కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. అక్రమ కేసులు అపకపోతే జంతర్‌మంతర్ దగ్గర ఆమరణ దీక్ష చేస్తానని... ఇంకో రెండు మూడు రోజుల్లో సానుకూల స్పందన రాకపోతే అదే చేస్తామని వెల్లడించారు కోమటిరెడ్డి. 

హైకోర్టు తీర్పును అమలు చేయాలని డీజీపీని కోరామన్నారు ఎమ్మెల్యే సంతప్... ఎమ్మెల్యేలకు కల్పించే సదుపాయాలు మాకు కల్పించాలని... మా గొంతును నులిపేయాలని టీఆర్ఎస్ చూస్తోందని ఆరోపించారు. మాకు గన్‌మెన్లను ఇవ్వాలని డీజీపీని కోరితే సెక్యూరిటి కమిటీ పంపిస్తామని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారని విమర్శించారు సంపత్. కోర్టు తీర్పును అమలు చేయకపోతే కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందని... గల్లీ నుండి ఢిల్లీ వరకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు సంపత్.