టీ పీసీసీ చీఫ్ గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి...?

టీ పీసీసీ చీఫ్ గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి...?

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తుంది. ఎప్పటినుంచో టీ పీసీసీ అధ్యక్షుడి నియామకం పై కసరత్తు జరుగుతున్న కాంగ్రెస్ హై కమాండ్ మాత్రం ఒక క్లారిటీకి రాలేక పోయింది. భువనగిరి లోక్ సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టీ పీసీసీ చీఫ్ నియమించనున్నారని తెలుస్తుంది. పార్లమెంట్ సమావేశాల తర్వాత ఆయన పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయినట్లు తెలుస్తుంది. కోమటిరెడ్డి పట్ల సోనియా కూడా సానుకూలంగా ఉండటం,తెలంగాణ బలమైన సామాజిక వర్గానికి ప్రాతినిధ్య వహిస్తుండటంతో టీ పీసీసీ పదవి కోమటిరెడ్డికే దక్కేచాన్స్ కనపడుతుంది.

తెలంగాణలో మరికొందరు నేతలు కూడా ఈ పదవిని ఆశిస్తున్నారు.మల్కాజిగిరి ఎమ్.పి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్లుభట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు,సీనియర్ నేతలు జానారెడ్డి, వి.హనుమంతరావు వంటివారు కూడా క్యూలో ఉన్నప్పటికీ పార్టీ అధిష్టానం కోమటిరెడ్డివైపు మొగ్గుచూపవచ్చని అంటున్నారు.ప్రస్తుత పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి పీసీసీ పదవికి రాజీనామా చేసినా కొత్త అధ్యక్షుడి నియామకం వరకూ ఆ పదవిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వారంలోనే కోమటి రెడ్డి నియామకం ఏఐసీసీ ప్రకటన చేసే అవకాశం ఉంది.