కోల్‌కతా టార్గెట్ 175

కోల్‌కతా టార్గెట్ 175

ఐపీఎల్‌ క్వాలిఫయర్ 2 పోరులో కోల్‌కతా ముందు 175 పరుగుల టార్గెట్‌ను ఉంచింది హైదరాబాద్... ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్... నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. సాహా 35, శిఖర్ ధావన్ 34 పరుగులు చేసి కీలకపాత్ర పోషించగా... ఇక చివర్లో కోల్‌కతా బౌలర్లకు చుక్కలు చూపించాడు రషీద్ ఖాన్... కేవలం 10 బంతులను ఎదుర్కొని నాలుగు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 34 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసిన హైదరాబాద్‌... కోల్‌కతా ముందు 175 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.