ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా

ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్‌కు చేరింది... సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా గ్రాండ్ విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసి హైదరాబాద్‌ 172 పరుగులు చేసి కోల్‌కతా ముందు 173 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచితే... మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోల్‌కతా విజయంలో అర్థ సెంచరీ చేసిన క్రిస్‌లిన్ కీలక పాత్ర పోషించాడు. రాబిన్ ఊతప్ప కూడా 45 పరుగులు చేసి సత్తా  చాటాడు... ఈ విజయంతో కోల్‌కతా ప్లేఆఫ్‌ బెర్తును ఖాయం చేసుకుంది. దీంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తర్వాత ప్లేఆఫ్‌కు చేరిన మూడో జట్టుగా నిలిచింది కోల్‌కతా టీమ్.