దత్తాత్రేయను పరామర్శించిన మాజీ సీఎం

దత్తాత్రేయను పరామర్శించిన మాజీ సీఎం

కుమారుడు వైష్ణవ్ మృతి చెందడంతో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఆవేదనలో ఉన్నారు. దత్తాత్రేయను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. సికింద్రాబాద్ లోని రామ్ నగర్ లో దత్తాత్రేయ నివాసానికి ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి వెళ్లారు. వైష్ణవ్ చిత్రపటం వద్ద పుష్ప గుచ్చం ఉంచి నివాళులర్పించారు. అనంతరం దత్తాత్రేయతో పాటు ఆయన కుటుంబసభ్యులను ఓదార్చి.. సానుభూతి తెలిపారు మాజీ సీఎం. చాలా చిన్న వయస్సులోనే వైష్ణవ్ మృతి చెందడం బాధాకరమని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. జరిగిన ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.