సునీల్ గవాస్కర్ చెత్త ఆటగాడు...

సునీల్ గవాస్కర్ చెత్త ఆటగాడు...

మాజీ భారత క్రికెటర్ కిరణ్ మోరే , దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఓ చెత్త ఆటగాడు అని తెలిపాడు. టెస్ట్ క్రికెట్‌లో 10,000 పరుగులు సాధించిన తొలి భారత  ఆటగాడు గవాస్కర్. అటువంటి ఆటగాడి గురించి మోరే మాట్లాడుతూ...నేను నెట్స్ లో చూసిన చెత్త ఆటగాళ్ళలో గవాస్కర్ ఒకడు. అతను నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడం ఎప్పుడూ ఇష్టపడడు.  అతను  ప్రాక్టీస్ చేయడాన్ని మీరు చూస్తే రేపు మ్యాచ్‌లో ఎలా ఆడబోతున్నాడు అనే అనుమానం కలుగుతుంది, కానీ మరుసటి రోజు జరిగే టెస్ట్ మ్యాచ్‌లో అతను బ్యాటింగ్  చేసినప్పుడు అది అతని ప్రాక్టీస్ కు  99.9 శాతం భిన్నంగా ఉంటుంది అని మోర్ పేర్కొన్నాడు. టీమ్ ఇండియా కోసం 49 టెస్టులు మరియు 94 వన్డేలు ఆడిన మోర్,  "సునీల్ గవాస్కర్ కు దేవుడు ఇచ్చిన  బహుమతి అతని ఏకాగ్రత అని తెలిపాడు.  ఒకసారి అతను తన జోన్లోకి ప్రవేశిస్తే... మీరు అతని పక్కన మాట్లాడిన లేదా అతని  డ్యాన్స్ చేసిన, అతను అందులో నుంచి బయటికి రాడు. టెస్ట్ క్రికెట్‌తో పాటు, వన్డే క్రికెట్‌లో గవాస్కర్ 108 మ్యాచ్‌ల్లో 35.13 సగటుతో ఒక సెంచరీ, 27 అర్ధ సెంచరీలతో 3,092 పరుగులు సాధించారు. ఫస్ట్ క్లాస్ మరియు లిస్ట్ ఎ క్రికెట్‌తో కలిపి గవాస్కర్ 86 సెంచరీలు, 142 హాఫ్ సెంచరీలతో 30,000 పరుగులు చేశాడు. అతను తన చివరి మ్యాచ్‌ను 1987 లో ముంబైలో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డేలో ఆడాడు