షాకింగ్ నిజం: కిమ్ ను సైతం శాసిస్తున్న మహిళ  ఆమె... 

షాకింగ్ నిజం: కిమ్ ను సైతం శాసిస్తున్న మహిళ  ఆమె... 

కిమ్ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు.  నార్త్ కొరియాలో అధికారంలోకి వచ్చిన తరువాత ఆ దేశం ఎన్ని కష్టాలు పడుతున్నదో అందరికి తెలిసిన విషయమే.  కిమ్ తండ్రి నుంచి అధికారాన్ని సొంతం చేసుకున్నాక, తనదైన శైలిలో పరిపాలించడం మొదలుపెట్టాడు.  అన్ని రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారు.  పొరుగున ఉన్న జపాన్, దక్షిణ కొరియాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాడు.  అటు అమెరికా ను కూడా అనేక ఇబ్బందులు పెడుతున్న కిమ్ ఎవర్ని నమ్మేవ్యక్తి కాదు.  

కానీ, ఇప్పుడు కిమ్ తన సోదరిని కిమ్ యో జోంగ్ ను పూర్తిగా విశ్వసించడం మొదలుపెట్టాడు.  ఆమె గతంలో కొన్ని సలహాలు మాత్రమే ఇచ్చేది.  కానీ, ఇప్పుడు కిమ్ కు పూర్తి స్థాయి సలహాదారుగా మారిపోయింది.  దేశ రాజకీయాల్లో ఆమె మాటకు విలువ పెరిగింది.  కిమ్ ఎక్కడికి ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఎక్కడ సంతకం పెట్టాలి అనే విషయాలు ఆమె చూసుకుంటోంది.  కిమ్ కు సంబంధించిన ప్రతి విషయం ఆమె తెలియకుండా జరిగేందుకు వీలు లేదు.  అంతేకాదు, అటు దక్షిణ కొరియాను హెచ్చరించినా, మొన్నటి రోజున దక్షిణ కొరియాతో కిమ్ తెగతెంపులు చేసుకున్నా, ఆ తతంగం మొత్తాన్ని వెనుకనుండి నడిపించింది కిమ్ సోదరి అన్నది వాస్తవం.  కిమ్ తరువాత సోదరికి పట్టం కట్టడం ఖాయం అనిపిస్తోంది.  కిమ్ ఎంతటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడో అందరికి తెలుసు.  కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో అన్న కిమ్ ను మించిపోయింది కిమ్ యో జోంగ్.   సోదరి ఎలా చెప్తే అన్న కిమ్ ఇప్పుడు అలా వింటున్నాడట.