కీలక భేటీకి కిమ్‌ రెడీ..

కీలక భేటీకి కిమ్‌ రెడీ..

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సింగపూర్‌లో అడుగుపెట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చరిత్రాత్మక సదస్సులో పాల్గొనేందుకు ఆయన రెండు రోజులు ముందుగానే సింగపూర్‌ చేరుకున్నారు. కిమ్‌తోపాటు ఆదేశ ప్రతినిధుల బృందానికి సింగపూర్‌ విదేశాంగ మంత్రి వివియన్‌ బాలకృష్ణ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. జీ7 సదస్సు ముగించుకుని డొనాల్డ్‌ ట్రంప్‌సహా ప్రతినిధుల బృందం ఇవాళ సాయంత్రం సింగపూర్‌ చేరుకుంటుంది. ట్రంప్-కిమ్‌లు గత 18 నెలలుగా ఒకరినొకరు హెచ్చరించుకోవడంతో ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ట్రంప్, కిమ్ మధ్య ఈనెల 12న జరిగే భేటీ ప్రాధాన్యత సంతరించుకున్నది.