మొత్తానికి అధినేత మరణ వార్త ఇలా సుఖాంతమైంది...!

మొత్తానికి అధినేత మరణ వార్త ఇలా సుఖాంతమైంది...!

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు సంబంధించిన వార్తలు గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తున్నాయి.  అధిక బరువుతో బాధపడుతున్న కిమ్ కు గుండెకు సంబంధించిన ఆపరేషన్ జరిగిందని, ఆపరేషన్ తరువాత కిమ్ బ్రెయిన్ డెడ్ అయ్యిందని, చనిపోయాడని రకరకాల కథనాలు మీడియాలో ప్రసారం అయ్యాయి.  

ఈ కథనాలలో వాస్తవం ఎంత ఉందొ తెలుసుకోకుండా ట్విట్టర్ లో కిమ్ మరణానికి సంతాపం తెలుపుతూ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ కావడంతో పాటుగా, కిమ్ తరువాత కిమ్ సోదరి అధికార పగ్గాలు చేపట్టబోతున్నట్టు వార్తలు వచ్చాయి.  నార్త్ కొరియా లోపల ఎం జరుగుతుంది అనే విషయం ఎవరికి తెలియదు.  నార్త్ కొరియా అధినేత కిమ్ రాజధాని ప్యాంగ్యాంగ్ లో లేడని మాత్రం అందరికి అర్ధం అయ్యింది.  ఏప్రిల్ 11, ఏప్రిల్ 25 వ తేదీల్లో ఉత్తర కొరియాలో జరిగే ప్రధానమైన వేడుకల్లో అధినేత కనిపించకపోవడంతో ఈ విధమైన రూమర్స్ క్రియేట్ అయ్యాయి. 

అయితే నార్త్ 38 ప్రాజెక్ట్ లో భాగంగా అమెరికా శాటిలైట్ వన్సన్ కల్మా టూరిస్ట్ బిల్డింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది.  అక్కడ అధినేత కుటుంబం వినియోగించే కిమ్ ట్రైన్ ఉండటంతో అధినేత అక్కడే ఉన్నారని నిర్ధారణ అయ్యింది.  ఇక ఉత్తర కొరియా అధికారిక మీడియా రోడొంగ్ సిన్ముం ఉత్తర కొరియా వర్కర్స్ కు శుభాకాంక్షలు చెప్పినట్టు పేర్కొన్నది. దీనిని ఉత్తర కొరియాకు చెందిన కొరియా హెరాల్డ్ కూడా దీనిని కన్ఫర్మ్ చేసింది.  కొరియా అధినేత ప్రస్తుతం రాజధాని ప్యాంగ్యాంగ్ లో లేరని, వన్సన్ కల్మా ప్రాంతంలో టూరిస్ట్ బిల్డింగ్ లో ఉన్నారని అర్ధం అవుతున్నది. దీంతో ప్రపంచ మీడియా సైతం ఈ వార్తలను ప్రచురించడంతో ఉత్తర కొరియా అధ్యక్షుడు సేఫ్ గా ఉన్నాడని అర్ధం అవుతున్నది.