కిమ్ మరో సంచలన నిర్ణయం: ఆశ్చర్యంలో కొరియన్లు... 

కిమ్ మరో సంచలన నిర్ణయం: ఆశ్చర్యంలో కొరియన్లు... 

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తీసుకునే నిర్ణయాలు భయపెట్టేవిగా ఉంటాయి.   కిమ్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని ఉత్తర కొరియా ప్రజల కంటే కూడా చుట్టుపక్కల ఉన్న దేశాలు ఆందోళన చెందుతుంటాయి.  దేశ అభివృద్ధి కంటే కూడా కిమ్ సైనిక వ్యవస్థ మీద, ఆయుధాల మీద ఎక్కువ దృష్టి పెడుతుంటాడు.  ఆయుధాలను సమకూర్చుకోవడంలో కొరియా నిత్యం నిమగ్నమై ఉంటుంది.   1950 లో జరిగిన కొరియా యుద్ధం తరువాత రెండు దేశాలుగా విడిపోయాయి.  

దక్షిణ కొరియా అభివృద్ధి పధంలో ముందుకు సాగితే, ఉత్తర కొరియా మాత్రం నియంత పాలనలో కొనసాగుతున్నది.   కిమ్ అధికారంలోకి వచ్చిన తరువాత అక్కడి పరిస్థితులు మరింత దిగజారాయి.  ప్రజలు ఆర్ధికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఉత్తర, దక్షిణ కొరియా సరిహద్దుల్లో నిర్మించిన సంయుక్త కార్యాలయాన్ని నార్త్ కొరియా పేల్చివేయడంతో బోర్డర్ లో ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి.  కొరియా యుద్ధం జరిగి 70 ఏళ్ళు పూర్తైంది,  70 ఏళ్ల  వార్షికోత్సవాలు తరువాత రెండు దేశాల మధ్య యుద్ధం జరగొచ్చనే ఊహాగానాలు వచ్చిన సమయంలో నార్త్ కొరియా అధ్యక్షడు కిమ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  దక్షిణ కొరియాపై సైనిక చర్యలు ఏవీ కూడా చేపట్టరాదని చెప్పి నిర్ణయం తీసుకున్నారు.  అధికార వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా మిలిటరీ కమీషన్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలియజేసింది.  దూకుడుగా వ్యవహరించే కిమ్ వెనక్కు తగ్గుతూ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.