కిమ్ తరువాత బాధ్యతలు చేపట్టేది ఎవరంటే... 

కిమ్ తరువాత బాధ్యతలు చేపట్టేది ఎవరంటే... 

ఉత్తర కొరియాలో ఏం జరుగుతున్నదో దాదాపుగా ఎవరికీ తెలియదు.  ఏప్రిల్ 11 తరువాత ఆ దేశంలో పరిస్థితులు మారిపోయాయని అంటున్నారు.  ఆదేశాధ్యక్షుడు కిమ్ ఏప్రిల్ 11 తరువాత కనిపించడం మానేశాడు.  ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు అనే విషయాలు బయటకు రావడం లేదు.  అధ్యక్షుడు కిమ్ కు ఆరోగ్యం బాగాలేదని, గుండెకు సంబంధించిన ఆపరేషన్ తరువాత అతని పరిస్థితి క్రిటికల్ గా మారిందని వార్తలు వస్తున్నాయి. 

ఇక అమెరికన్ మీడియా అయితే ఏకంగా కిమ్ బ్రెయిన్ డెడ్ అయ్యాడని చెప్పి వార్తలు రాసుకొస్తోంది. కిమ్ తరువాత బాధ్యతలు ఎవరు చేపట్టబోతున్నారు అనే దానికి ఇప్పటికే సమాధానం దొరికింది. కిమ్ సోదరి కిమ్ యో జోంగ్  పదవీ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.  దేశంలో ఆమె బలమైన నాయకురాలిగా ఇప్పటికే ముద్ర వేసుకుంది.  కిమ్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఆమె హస్తం ఉన్నట్టుగా ఉత్తర కొరియా మీడియా చెప్పకనే చెప్తున్నది.  గత కొంతకాలంగా ఆమె జాతీయ రాజకీయాల్లో కీలక, చురుకైన పాత్రను పోషిస్తోంది.  అధ్యక్షుడికి ఏమైనా జరిగితే బాధ్యతలు స్వీకరించడానికి అనుగుణంగానే ఆమెను జాతీయ రాజకీయాల్లోకి తీసుకొచ్చారని కూడా ప్రచారం సాగింది.  ఇప్పుడు అది నిజం అవుతుందనే అంటున్నారు విశ్లేషకులు. ఒక విధంగా చెప్పాలంటే కిమ్ కంటే కూడా అయన సోదరి కిమ్ యో జోంగ్ చాలా పవర్ఫుల్ లీడర్ అని కొందరి అభిప్రాయం.