చిన్నారి రోదన: నాన్న బయటకు వెళ్లొద్దు... కరోనా ఉంది... 

చిన్నారి రోదన: నాన్న బయటకు వెళ్లొద్దు... కరోనా ఉంది... 

కరోనా వైరస్ రోజు రోజుకు దేశంలో పెరిగిపోతున్న తరుణంలో సామాన్య ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు.  ఇంట్లోనే ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.  అత్యవసర సర్వీసులలో ఉండే సిబ్బంది పోలీసులు, వైద్యులు, మిగతా కొన్ని డిపార్ట్మెంట్ వ్యక్తులు తప్పించి మరెవ్వరూ కూడా బయటకు వెళ్లేందుకు సాహసించడం లేదు.  

మహారాష్ట్రలో పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో  ప్రతి ఒక్కరిని అవేర్ చేస్తున్నారు.  కరోనా ఎలా ఉంటుందో తెలియకపోయినా చిన్న పిల్లలు కూడా కరోనా అంటే భయపడుతున్నారు.  తన తండ్రి బయటకు వెళ్తున్నాడని తెలిసి చిన్నారు ఏడవడం మొదలుపెట్టింది.  బయట కరోనా ఉంది వెళ్లొద్దు అని పెద్దపెద్దగా ఏడుస్తున్నాడు.  అయితే, బయటకు వెళ్లాల్సిన పరిస్థితి.  ఎందుకంటే అతను పోలీస్ కానిస్టేబుల్.  ఈ సమయంలో అతను ఇంట్లో కూర్చోలేడు.  ఈ న్యూస్, ట్విట్టర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. .