టీడీపీ రాజకీయ తీర్మానంలోని కీలక అంశాలు...

టీడీపీ రాజకీయ తీర్మానంలోని కీలక అంశాలు...

విజయవాడలోని కానూరులో తెలుగుదేశం పార్టీ మహానాడు 2018 వేదికగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ నిర్ణయాలు మార్చుకోవాలని తీర్మానంలో పేర్కొన్న టీడీపీ... మరికొన్ని కీలక అంశాలను ప్రస్తావించింది. 

టీడీపీ రాజకీయ తీర్మానంలోని అంశాలు:
- జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలి. 
- దేశంలో రాజకీయ పునరేకీకరణకు కంకణబద్ధం కావాలి. 
- 2019 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. 
- నరేంద్ర మోడీ - అమిత్‌ షా నిరంకుశ పాలనతో దేశం విసిగిపోయింది. 
- యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఏడాదిలోపే గోరఖ్‌పూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ పరాజయమే బీజేపీపై వ్యతిరేకతకు నిదర్శనం.
- టీడీపీ... ఎన్డీఏ నుంచి బయటకొచ్చాక కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాలేకపోయింది. 
- అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం, మైనింగ్ మాఫియాను అభ్యర్ధులుగా నిలబెట్టి బీజేపీ నైతిక విలువలకు తిలోదకాల్చింది.
- కర్నాటకలో బీజేపీని ఓడించాలని చంద్రబాబు పిలుపు ఇవ్వడం వల్లే బీజేపీ పరాజయం పాలైంది. 
- చంద్రబాబు పిలుపుతో తెలుగువాళ్లు ఎక్కువగా ఉన్న కర్ణాటకలోని నియోజకవర్గాల్లో బీజేపీ ఓడిపోయింది. 
- కర్నాటక ఎన్నికలు బీజేపీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడానికి నాంది పలికాయి. 
- కర్నాటక సీఎం కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరు కావడం దేశంలో రాజకీయ పునరేకీకరణకు తార్కాణంతో పాటు మరికొన్ని అంశాలను రాజకీయ తీర్మానంలో పేర్కొంది టీడీపీ...