ఆర్‌బీఐ ఏం చెప్పిందంటే...

ఆర్‌బీఐ ఏం చెప్పిందంటే...

భారత రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) 2018-19 ద్వైమాసిక పరపతి విధానాన్ని ప్రకటించింది. ఆ పాలసీలోని కీలక అంశాలు...

  • రెపో రేటు పెంపు... మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత తొలిసారి రెపో రేటు పెంచారు. పావు శాతం పెంచడంతో తాజా రెపో రేటు 6.25 శాతానికి చేరింది. 
  • బ్యాంకులు తన వద్ద నుంచి తీసుకునే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీనే రెపో రేటు అంటారు.
  • రివర్స్‌ రేపో రేటు 6 శాతంగా సవరించారు.
  • బ్యాంక్‌ రేటు 6.5 శాతానికి చేరింది.
  • జీడీపీ వృద్ధి రేటు అంచనాలో మార్పు లేదు. ఇది వరకే చెప్పినట్లు 2018-19లో 7.4 శాతం ఉంటుందని ఆర్‌బీఐ పేర్కొంది.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.8 శాతం నుంచి 4.9 శాతం మధ్య ఉంటుంది.
  • ద్వితీయార్థంలో 4.7 శాతం ఉంటుందని ఆర్‌బీఐ అంచనా.
  • అర్బన్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకులను చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులుగా మార్చేందుకు విధివిధానాలు త్వరలో వెల్లడి
  • ప్రభుత్వ సెక్యూరిటీలపై ఈల్డ్‌ పెరగడం వల్ల వచ్చిన నష్టాలను ఒకేసారి కాకుండా.. నాలుగు త్రైమాసికాలకు సర్దుబాటు చేసుకోవచ్చని బ్యాంకులకు తెలిపింది.
  • చిన్న ఇంటి రుణాలు కూడా ఎన్‌పీఏలుగా మారుతున్నాయి. రూ.2 లక్షల లోపు రుణాలను చిన్న గృహ రుణాలుగా పరిగణిస్తారు. బ్యాంకులు వెంటనే దీనిపై శ్రద్ధ చూపాలని   ఆర్‌బీఐ బ్యాంకులను హెచ్చరించింది.