మరో ఆఫర్ దక్కించుకున్న' రొమాంటిక్'హీరోయిన్..

మరో ఆఫర్ దక్కించుకున్న' రొమాంటిక్'హీరోయిన్..

డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాద్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతానున్న తాజా చిత్రం రొమాంటిక్. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న టైం లోనే కరోనా కారణంగా ఆగిపోయింది.కాగా ఈ సినిమాలో   కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఉత్తరాదికి చెందిన ఈ భామ తన అందచందాలతో పిచ్చెక్కిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రాళ్ళ మతి పోగొడుతోంది.తొలి చిత్రం విడుదల కాకుండానే మరో చిత్రంలో అవకాశం దక్కించుకుంది కేతిక శర్మ.తాజాగా యంగ్ హీరో నాగశౌర్యతో రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసింది. నాగశౌర్య హీరోగా `సుబ్రమణ్యపురం` ఫేమ్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో నాగశౌర్యకు జోడీగా కేతిక శర్మని ఫైనల్ చేశారట.