హ్యాండిస్తుందని అప్పుడే చెప్పా..

హ్యాండిస్తుందని అప్పుడే చెప్పా..

టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయవాడలో జరిగిన మిని మహానాడులో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తుందని ఏడాది క్రితం ఇదే మహానాడు వేదిక మీద చెప్పానని.. నేడు ఇదే నిజమైందని నాని అన్నారు. ఏపీకి అన్యాయం చేశారనే కడుపు మంటతోనే ఐదు కోట్ల మంది ఆంధ్రులు అమిత్ షా కాన్వాయ్‌పై దాడి చేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.. ఏపీకి ప్రత్యేక హోదా.. విభజన హామీలు అమలు జరిగే వరకు తమ పోరాట ఆగదని.. వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఒక సిద్ధాంతం లేదని.. బీజేపీ సహకారంతో జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని చూస్తున్నారని ఆరోపించారు.