మాస్క్ తప్పనిసరి..లేకపోతే 10వేలు జరిమానా..!

మాస్క్ తప్పనిసరి..లేకపోతే 10వేలు జరిమానా..!

కరోనా ను సమర్ధవంతంగా ఎదురుకొంటున్న రాష్ట్రాల్లో కేరళ కూడా ఒకటి. కేరళలో మొదట్లో కరోనా కేసులు భారీగా నమోదయినప్పటికీ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కట్టడి చేయగలిగింది. ఇప్పుడు పూర్తిగా కరోనా నిర్మూలనకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. దానిలో భాగంగా ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది. అంటువ్యాధుల చట్టం కింద పలు నిబంధనలతో కూడిన  ఓ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. కాగా నిబంధనల్లో ఏ ఒక్కటి ఉల్లంఘించినా 10వేల జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష విదిస్తామని స్పష్టం చేసింది. నిబంధనల్లో భాగంగా...పబ్లిక్ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. పబ్లిక్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఆరడుగుల దూరం పాటించాలి. షాపులు, వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే ప్రదేశాల్లో 25 మందికి మించి ఉండకూడదు. వివాహ కార్యక్రమాల్లో 50, అంత్యక్రియల్లో 20 మందికి మించకూడదు. ధర్నాలు ర్యాలీలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి..10 మందికి మించకూడదు. భహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయరాదు. కేరళకు వచ్చేవాళ్ళు ముందుగానే  ‘రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ జాగ్రత’ లో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ రూల్స్ ను ఏడాదిపాటు అమలుచేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.