పందెంకోడి 2 కీర్తి సురేష్ లుక్‌.. 

పందెంకోడి 2 కీర్తి సురేష్ లుక్‌.. 

`పందెంకోడి` చిత్రంతో విశాల్ హీరోగా తెరంగేట్రం చేశాడు. తొలి సినిమాతోనే యాక్ష‌న్ హీరోగా స‌త్తా చాటాడు. న‌ల్ల‌న‌య్య స్ఫుర‌ద్రూపం ప‌క్కా యాక్ష‌న్‌కి ఫిట్ అంటూ క్రిటిక్స్ కితాబిచ్చేశారు. నాటి నుంచి విశాల్ ఆ జోన‌ర్‌ని వ‌దిలిపెట్టిందే లేదు. ప్ర‌స్తుతం త‌న కెరీర్ కీల‌క చిత్రం `పందెంకోడి` సీక్వెల్‌లో న‌టిస్తున్నాడు. తెలుగులో `పందెం కోడి 2`, త‌మిళంలో `సందెకోజి 2` పేరుతో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. విశాల్ బాడీలో పొగ‌రు, ఒగ‌రు చూపించే సినిమా ఇద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఈ చిత్రంలో విశాల్ స‌ర‌స‌న కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టించింది. ఆస‌క్తిక‌రంగా ఇదే చిత్రంలో విశాల్ రియ‌ల్ లైఫ్ ప్రాణ‌స‌ఖి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ విల‌న్ పాత్ర పోషించ‌డం త‌మిళ‌నాట హాట్ టాపిక్‌గా మారింది. ర‌జ‌నీ న‌ర‌సింహాలో నీలాంబ‌రి ర‌మ్య‌కృష్ణ‌లా.. విశాల్‌పై కుయుక్తులు ప‌న్నే వీర‌నారిగా వ‌ర‌ల‌క్ష్మి న‌టిస్తోందిట‌. ఆ ఇద్ద‌రిమ‌ధ్యా వార్ తెర‌పై చూసి తీరాల్సిందేనంటూ ఒక‌టే క్యూరియాసిటీ రెయిజ్ అవుతోంది. 

అదంతా స‌రే.. అస‌లు ఈ చిత్రంలో కీర్తి సురేష్ ఎలాంటి పాత్ర‌లో న‌టిస్తోంది. ఇటీవ‌లే మ‌హాన‌టి సావిత్రి పాత్ర‌లో తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల్ని అల‌రించిన కీర్తి .. విశాల్ స‌ర‌స‌న ఏ తీరుగా క‌నిపించ‌బోతోంది? అన్న ఉత్కంఠ అభిమానుల్ని నిల‌వ‌నీయ‌డం లేదు. అలాంటి వారికోసం ఇదిగో కీర్తి లుక్‌ని ఆన్‌లైన్‌లో రిలీజ్ చేశారు. అచ్చం తిరునాళ్ల‌లో ప‌ల్లెటూరి అమ్మాయిలా కీర్తి ఎంత బుద్ధిగా ఉందో.. బావ‌ను చెరుకు గ‌డ, ప‌ల్లి బ‌టానీ కొనిమ్మ‌ని అడిగే బాప‌తులా ఉంది.