మాస్ హీరో గోపీచంద్ సరసన మహానటి... 

మాస్ హీరో గోపీచంద్ సరసన మహానటి... 

వరుస అవకాశాలు అందుకుంటూ కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా కొనసాగుతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత అవకాశాలు ఈ భామను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం కీర్తి తెలుగులో నితిన్ సరసన 'రంగ్ దే', మహేష్ 'సర్కారు వారి పాట'లో నటిస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా మరో అవకాశం కూడా వచ్చిందట. మాస్ హీరో గోపీచంద్, తేజ దర్శకత్వంలో 'అలిమేలుమంగ వేంకటరమణ' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా నటించే అవకాశం ఈ మహానటికి వచ్చిందట. అయితే మొదట ఇందులో అనుష్క నటిస్తుంది అని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ అవకాశం కీర్తి సురేష్‌కు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ సినిమా గోపిచంద్ గత సినిమాలతో పోలిస్తే కొత్తగా మొత్తం ఫ్యామిలీ డ్రామా నేపథ్యం లో రానున్నట్లు సమాచారం. గోపిచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో ఆయనకు జంటగా మిల్క్ బ్యూటీ తమన్నా నటిస్తుంది.