ఆ బయోపిక్ పై కీర్తి సురేష్ స్పందన

ఆ బయోపిక్ పై కీర్తి సురేష్ స్పందన

సావిత్రి జీవిత కథతో వచ్చిన సినిమా మహానటి.  ఈ సినిమా విడుదలైన ప్రతి సెంటర్ లో మంచి విజయాన్ని నమోదు చేసుకుంటున్నది. కీర్తి సురేష్ నటనకు ప్రముఖులంతా ఫిదా అయిన సంగతి తెలిసిందే.  సావిత్రి బయోపిక్ మహానటి హిట్ కావడంతో తెలుగు, తమిళంలో ప్రముఖుల బయోపిక్ చిత్రాలు నిర్మించేందుకు దర్శక నిర్మాతలు ఉత్సాహం చూపుతున్నారు.  

కాగా, సావిత్రి బయోపిక్ తరువాత, సినీనటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. జయలలిత బయోపిక్ లో కూడా కీర్తి సురేష్ నటిస్తోందని పుకార్లు వెలువడ్డాయి.  మొదట జయలలిత బయోపిక్ లో త్రిషా నటిస్తుందని అనుకున్నారు.  ఆ తరువాత లక్ష్మీరాయ్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది.  తాజగా ఇప్పుడు కీర్తి సురేష్ పేరు బయటకు వచ్చింది.  ఈ పుకార్లపై కీర్తి సురేష్ స్పందించింది.  తాను బయోపిక్ లో నటిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని, తనను ఇంతవరకు ఎవరు సంప్రదించలేదని చెప్పింది