రేపు సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం...రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ

రేపు సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం...రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ

రేపు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కరోనా...వ్యవసాయం...రాష్ట్ర అవతరణ  వేడుకలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు...లాక్‌డౌన్‌ అమలుపైనా చర్చిస్తారు. కరోనా కట్టడికి భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సరి-బేసి పద్ధతిలో షాపులు తెరుస్తున్నారు. మరికొంత కాలం ఇలాగే కొనసాగించాలా లేక ఏమైనా మార్పులు చేయాలా అనే అంశంపై ఈ సమావేశంలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటారు. వర్షా కాలం సమీపిస్తున్న తరుణంలో వ్యవసాయంపైనా చర్చ జరగనుంది. గ్రామాల్లో ఎరువుల లభ్యత...విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎలా జరపాలనే విషయంపైనా ఉన్నతస్థాయి స మావేశంలో సమీక్ష నిర్వహిస్తారు సీఎం కేసీఆర్.