లాక్ డౌన్ పై కేసీఆర్ కీలక సమావేశం..ఉద్యోగులకు తీపి కబురు...!

లాక్ డౌన్ పై కేసీఆర్ కీలక సమావేశం..ఉద్యోగులకు తీపి కబురు...!

లాక్ డౌన్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కోత‌పెట్టారు. ఈనెలలో మాత్రం ఉద్యోగులకు పూర్తి వేత‌నం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఏపీ, మహారాష్ట్రలో తెలంగాణ కంటే ఎక్కువ కేసులు న‌మోద‌వుతున్నాయి దీంతో అంత‌ర్రాష్ట్ర స‌ర్వీసుల‌పై ఉత్కంఠ నెల‌కొంది. దీనిపై కూడా ఈరోజు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పెన్షనర్లకు కూడా ఈ నెల నుంచి పూర్తి పెన్షన్ చెల్లించనున్నారు. పెన్షన్లు పూర్తిగా చెల్లించాలంటూ ఇప్పటికే హైకోర్టు ఆదేసించింది.

మెట్రో, హైద‌రాబాద్‌లో ఆర్టీసీ బ‌స్సు స‌ర్వీసులు, రాత్రిపూట క‌ర్ఫ్యూ పై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మాల్స్, రెస్టారెంట్ల ఓపెనింగ్,థియోటర్లకు మాత్రం ఇప్పట్లో అనుమతి లేనట్టే తెలుస్తుంది. జూన్ రెండున తెలంగాణ అవ‌త‌ర‌ణ దినోత్సవం ఎలా నిర్వహించాలనే విషయంపైనా చర్చ జరగనుంది. ఢిల్లీ లాంటి మెట్రో స‌ర్వీసుల‌కు గ్రీన్ సిగ్నల్ వ‌స్తుండ‌టంతో హైద‌రాబాద్ మెట్రోపై మంత‌నాలు చేస్తున్నారు. రాష్ట్ర మంత‌టా ఆర్టీసీ స‌ర్వీసులు మొద‌ల‌వ్వగా హైద‌రాబాద్‌లో కేసులు ఎక్కువ‌గా న‌మోదు అవుతుండ‌టంతో అయోమ‌యం నెల‌కొంది. దీనిపై కూడా సీఎం కేసీఆర్ ఈ రోజు క్లారిటీ ఇవ్వనున్నారు.