నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్

 నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ప్రధానితో భేటీ అయ్యే అవకాశం ఉందని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు సహా విభజన హామీలు, కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా, రక్షణ శాఖ భూముల కేటాయింపు వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు సీఎం కేసీఆర్. కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాధ్‌ సింగ్, నితిన్‌ గడ్కరీలను కూడా  సీఎం కలవనున్నారు.