ఒక వైపు పోతిరెడ్డిపాడు వివాదం...మరో వైపు గోదావరి జలాలపై కేసీఆర్‌ దృష్టి

ఒక వైపు పోతిరెడ్డిపాడు వివాదం...మరో వైపు గోదావరి జలాలపై కేసీఆర్‌ దృష్టి

రాష్ట్రంలో నది జలాలపై తెలంగాణ  సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు...ఈనెల 17న గోదావరి ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాలకు చెందిన మంత్రులు, అధికారులతో భేటీ కానున్నారు...ఒక వైపు కృష్ణా జలాల వివాదం నడుస్తోంటే గోదావరి జలాలపై కేసీఆర్‌ సమావేశం నిర్వహించడంపై తెలుగురాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

వచ్చేది  వర్షాకాలం కావడంతో సీఎం కేసీఆర్ ఇప్పటినుంచే నదీ జలాల వినియోగం ప్రణాళికలపై దృష్టి పెట్టారు... ఈ వర్షాకాలంలో గోదావరి నదీ జలాలను సమర్థంగా వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించడం కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు... గోదావరి ప్రాజెక్టులు, పరివాహక ప్రాంతాల మంత్రులు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు...ఈ సమావేశం ఉదయం 11 గంటల నుంచి రోజంతా కొనసాగుతుందని తెలంగాణ సీఎంవో వెల్లడించింది... శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ), దిగువ మానేరు డ్యాం (ఎల్ఎండీ), మిగతా జలాశయాలకు నీటి తరలింపు, నీటి వినియోగం తదితర అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు...