స్పెషల్ : కేసీఆర్ బర్త్‌డే ఈసారి గ్రీన్ గా

స్పెషల్ : కేసీఆర్ బర్త్‌డే ఈసారి గ్రీన్ గా

తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు తెలంగాణ ప్రజలకు పండుగ రోజు. అందుకే కేసీఆర్‌కు మొక్కల పండుగతో విషెష్ చెప్పేందుకు గులాబీదళం సిద్ధమైంది . మొక్కలు నాటుదాం, తెలంగాణను ఆకుపచ్చగా మార్చుకుందామన్న కేటీఆర్ పిలుపుతో ప్రభుత్వశాఖలు, ఉద్యోగసంఘాలు సీఎం కేసీఆర్‌కు హరితహారం గిఫ్ట్‌గా ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్ ఊపందుకుంది. ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్  ప్రారంభించిన మొక్కలు నాటే కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రముఖుల్ని భాగస్వామ్యం చేసింది. సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు భాష‌, స‌రిహ‌ద్దులు చెరిపేసి పాల్గొన‌డంతో  అది విశ్వవ్యాప్తం అయింది. 

కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా నక్లెస్ రోడ్డులోని జలవిహార్‌లో ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంపును .. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభిస్తారు. ఇక శాసనమండలి ఛైర్మన్.. గుత్తా సుఖేందర్ రెడ్డి మొక్కలు నాటుతారు. కేసీఆర్ జీవితక్రమాన్ని వివరించే ఫోటో ఎగ్జిబిషన్‌ను.. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ప్రారంభిస్తారు. ప్రభుత్వ పథకాల LED ప్రదర్శనశాలను.. హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభిస్తారు. ఎంపీ సంతోష్ కుమార్.. వికలాంగులకు వీల్ చైర్స్ పంపిణీ చేస్తారు.సీఎం బర్త్‌డే పురస్కరించుకుని ఎంపీ కేశవరావు.. భారీ కేక్ కట్ చేయనున్నారు. అటు ఏపీలో టీఆర్ఎస్ నాయకులు..  ఘనంగా కేసీఆర్  పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్నారు. విజయవాడ దుర్గగుడిలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆంధ్ర టీఆర్ఎస్ భవన్‌లో కేక్ కటింగ్ చేస్తారు

కేసీఆర్ బర్త్ డేకి  హైద‌రాబాద్‌లో  ఈసారి సంద‌డే సంద‌డి. మెట్రో పిల్లర్లపైన ఎటూ చూసినా  కేసియార్ బ‌ర్త్ డే విషెష్  ఫ్లెక్సీలే ద‌ర్శన‌మిస్తున్నాయి. న‌గ‌రం అంతా హోర్డింగ్‌ల‌ు కనిపిస్తున్నాయి. అంద‌రి దృష్టిని ఆక‌ర్షించేందుకు ఇన్నోవేటివ్‌గా ప్రోగ్రామ్స్ త‌యారుచేస్తున్నారు. వి ల‌వ్ కేసియార్ పేరుతో కొన్ని కార్యక్రమాలు చేస్తుండ‌గా -పెయింటింగ్స్ , చిత్రకళా ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. జంట‌న‌గ‌రాల్లోని క‌వ‌ల‌లంద‌రినీ  ఒకే చోటుకు చేర్చింది మ‌రో సంస్థ. ఇలా ఒక‌టి కాదు రెండు కాదు ఈసారి కేసీఆర్ బ‌ర్త్ డేకు రెట్టించిన ఉత్సాహంతో కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. గ‌జ్వేల్లో  2600 మంది మొక్కలు ప‌ట్టుకుని 66వేల చ‌ద‌ర‌పు మీట‌ర్ల విస్తీర్ణంలో కేసియార్ రూపంలో నిల‌బ‌డ్డారు. ఇక విదేశాల్లో కూడా టీఆర్ఎస్ ఎన్నారై శాఖలు కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నాయి.