కార్తి చిదంబరం కంపెనీకి లక్షల్లో లంచం

కార్తి చిదంబరం కంపెనీకి లక్షల్లో లంచం

అడ్వాంటేజ్‌ స్ర్టాటెజిక్‌ కన్సల్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ పూర్తిగా కార్తి చిదంబరం చేతిలో ఉందని, ఈ కంపెనీకి లంచం రూపంలో రూ. 26 లక్షలు అందాయని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ (ఈడీ) ఆరోపించింది. కార్తి చిదంబరం పై ఇవాళ  ఢిల్లీ కోర్టులో ఈడీ చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కంపెనీతో పాటు చెస్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ అనే కంపెనీతో పాటు మరికొందరిని ఇందులో ముద్దాయిలుగా పేర్కొంది. వీరిపై మనీ లాండరింగ్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అడ్వాంటేజ్‌ కన్సల్టింగ్‌ కంపెనీని కార్తి చిదంబరం ఆదేశాల మేరకే నెలకొల్పారని, ఆయన నియంత్రణలోనే కంపెనీ నడుస్తోందని ఈడీ పేర్కొంది. ఈ కంపెనీ ఏర్పాటు చేసేందుకు నిధులు కూడా కార్తి నుంచే వచ్చాయని తెలిపింది. చెస్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీకి మాక్సిస్‌, ఇతర మలేషియా కంపెనీల నుంచి రూ. 90 లక్షలు అందాయని.. ఇవన్నీ ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్‌కు అనుమతులు మంజూరు చేయడానికి  క్విడ్‌ ప్రొ క్వొగా అందాయని ఈడీ పేర్కొంది. ఎఫ్‌డీఐ కింద రూ.180 కోట్లు మాత్రమే మ్యాక్సిస్‌ నుంచి రావాల్సి ఉండగా,  వాస్తవానికి రూ. 3,565 కోట్లు  కోట్లు వచ్చాయని ఈడీ పేర్కొంది.