హైదరాబాద్‌కు కర్ణాటక ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌కు కర్ణాటక ఎమ్మెల్యేలు

కర్ణాటక ఎమ్మెల్యేల బస హైదరాబాద్‌కు మారింది. బెంగళూరు నుంచి మొత్తం నాలుగు బస్సుల్లో ఎమ్మెల్యేలను తరలించారని.. వీటిలో రెండు తాజ్ కృష్ణకు, ఒకటి నోవాటెల్‌కు చేరుకున్నాయి.. మరో బస్సు మార్గమధ్యంలో ఉందని మరికొద్దిసేపట్లో ఆ బస్సు కూడా హైదరాబాద్‌కు చేరుకోనుంది. బంజారా హిల్స్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీ చందర్‌ బసకు సంబంధించిన ఏర్పాట్లు చూస్తున్నారు. 

సీఎంగా యడ్యూరప్పకు తనకున్న బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా గవర్నర్ 15 రోజులు గడువునివ్వడంతో.. తమకు కావల్సిన ఎమ్మెల్యేల కోసం కాంగ్రెస్-జేడీఎస్‌లను చీల్చాలని బీజేపీ పావులు కదుపుతోంది. దీంతో శాసనసభ్యులను కాపాడుకునేందుకు ఈ రెండు పార్టీలు క్యాంపు రాజకీయాలు మొదలెట్టాయి. ఇప్పటికే బెంగళూరులోని రెండు రిసార్టులకు వీరిని తరలించారు. అయితే బెంగళూరులో వీరు బస చేసిన రిసార్టుకు భద్రత తగ్గించడంతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో.. క్యాంపును మార్చాలని కాంగ్రెస్-జేడీఎస్‌లు భావించాయి. దీంతో వీరిని రెండు ఛార్టెడ్ విమానాలలో కొచ్చి తరలించారని అయితే విమానాలకే టేకాఫ్ ఇవ్వకపోవడంతో.. ఎమ్మెల్యేలను బస్సుల్లో కొచ్చికి పంపిస్తున్నారని.. పుదుచ్చేరికి పంపిస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ వీరిలో కొందరిని హైదరాబాద్ తరలించినట్లు తెలుస్తోంది. బస్సు హైదరాబాద్ కు చేరుకున్నాక పూర్తి వివరాలు అందనున్నాయి.