కరీనా ఫిట్నెస్ మంత్ర

కరీనా ఫిట్నెస్ మంత్ర
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ అనగానే జీరో సైజ్ బాడీ గుర్తుకు వస్తుంది.  సినిమాలో బిజీగా ఉన్న సమయంలో కరీనా ఈ సైజ్ ను మైంటైన్ చేశారు.  సైఫ్ ఆలీఖాన్ తో వివాహం జరిగి, ఓ కుమారుడు పుట్టిన తరువాత ఆమె కొద్దిగా లావయ్యారు.  అయితే, కుమారుడు తైమూర్ కు సంవత్సరం వయసు రాగానే కరీనా తిరిగి ఫిట్నెస్ బాట పట్టారు.  సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ నమ్రత పురోహిత్ ఆధ్వర్యంలో 35 సంవత్సరాల కరీనా కపూర్ తిరిగి సైజ్ జీరోను సాధించారు.  సైజ్ జీరో కు మారడానికి కరీనా చాలా కష్టపడ్డారట. 
 
ప్రస్తుతం కరీనా వీరే ది వెడ్డింగ్ సినిమాలో నటిస్తోంది.  ఈ సినిమా ఈవెంట్ కు హాజరైన కరీనాను చూసి అందరు ఆశ్చర్యపోయారట.  కరీనా కపూర్ ఫిట్నెస్ వర్కౌట్ కు సంబంధించిన వీడియోలను ఇటీవలే ఆమె ఫిట్నెస్ ట్రైనర్ నమ్రత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.