అనుభవంతో అందరినీ కలుపుకుపోతా...

అనుభవంతో అందరినీ కలుపుకుపోతా...

నా అనుభవంతో పార్టీలో అందరినీ కలుపుకుపోతానని... అందరూ తనకు సహకరిస్తారని దీమా వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్‌, భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ... పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నిర్వహిస్తున్న కీలక భేటీకి ఢిల్లీ వెళ్లిన కన్నా... ఎన్టీవీతో మాట్లాడుతూ... నాకు కులం, మతం, వర్గం, వివక్ష  అంటూ ఏమీ లేదన్నారు... అన్ని సామాజికవర్గాలు నాకు అండగా ఉంటాయనే నమ్మకం ఉందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. నా రాజకీయ జీవితంలో నాగురించి  తెలిసిన వారికి నా వ్యవహారశైలి తెలుసన్నారాయన.

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పట్ల రాష్ట్ర ప్రజలలో ఉన్న వ్యతిరేక అభిప్రాయాన్ని తొలగిస్తామన్నారు కన్నా... వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. స్వార్ధం కోసం బీజేపీపై నిందలు వేశారని ఆరోపించిన ఆయన... ఇవ్వాల్సిన దానికంటే, రాష్ట్రానికి అదనంగా కేంద్రం తోడ్పాటును అందించిందని... ఆ విషయాన్ని ప్రజలకు వివరిస్తాం... ప్రజలు అర్ధం చేసుకుంటారనే ప్రగాఢ నమ్మకం నాకుందన్నారు. తనపై ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను శ్రద్ధగా నిర్వరిస్తానన్నారు కన్నా లక్ష్మీనారాయణ.