టీటీడీపై మాట్లాడితే మీకెందుకు ఉలికిపాటు?

టీటీడీపై మాట్లాడితే మీకెందుకు ఉలికిపాటు?

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో అన్యాయం జరుగుతుందంటే మీరెందుకు ఉలికి పడుతున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ నేతలపై మండిపడ్డారు బీజేపీ, ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ... గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన... టీటీడీపై రమణదీక్షితులు చేస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీటీడీ వ్యవహారంతో తెలుగుదేశం ప్రభుత్వం భయపడుతుందంటే మాకు కూడా అనుమానంగా ఉందన్న కన్నా... టీటీడీ వ్యవహారం కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమన్నారు. తిరుమలపై ప్రశ్నించినందుకు బొక్కలో వేసి తంతామంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం  చేశారు కన్నా లక్ష్మీనారాయణ.