విలియమ్సన్‌ @ 735

విలియమ్సన్‌ @ 735

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్లో సన్‌రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్ (36 బంతుల్లో 47) అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో 700లకు పైగా పరుగులు సాధించిన ఐదో ఆటగాడిగా కేన్ నిలిచాడు. ఐపీఎల్‌లో చరిత్రలో ఓ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ ఏడాది అద్భుతమైన ఆటతీరు కనబర్చిన విలియమ్సన్ ఏకంగా 735 పరుగులను ఖాతాలో వేసుకుని ఆరెంజ్ క్యాప్‌కు గురి పెట్టాడు. ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డ్ విరాట్ కోహ్లి పేరిట ఉంది. 2016లో కోహ్లి 976 పరుగులు చేశాడు.