ఇవాళే నా నువ్వే 

ఇవాళే నా నువ్వే 

నందమూరి కళ్యాణ్ రామ్ తాజగా నటించిన చిత్రం "నా నువ్వే". తమిళ దర్శకుడు జయేంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. ఇది వరకే షూటింగ్ పూర్తి చేసుకోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించడం విశేషం. మే 25న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇక ఇవాళ ఉదయం పది గంటలకు సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఇది వరకే విడుదలైన టీజర్ చాలా కొత్తగా అనిపించడంతో అందరి దృష్టిని బాగా ఆకర్షించింది. అటు శరీత్ అందించిన పాటలు కూడా ఫ్రెష్ ట్యూన్స్ తో శ్రోతలను అలరిస్తున్నాయి. ఈ సినిమా డిఫెరెంట్ లవ్ స్టోరీగా ఉండడంతో కళ్యాణ్ రామ్ తన లుక్ ను మొత్తం మార్చి..అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై నిర్మితమైంది.