ఎన్టీఆర్ బయోపిక్ లో మనవడికి ఛాన్స్ ఉందా?

ఎన్టీఆర్ బయోపిక్ లో మనవడికి ఛాన్స్ ఉందా?

దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో 'ఎన్టీఆర్' బయోపిక్ ను రూపొందిస్తున్నారు. బాలకృష్ణ.. ఎన్టీఆర్ పాత్ర పోషించనున్నారు. అయితే ఈ సినిమాలో ఆయన మనవళ్లు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు కనిపిస్తారా..? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. కళ్యాణ్ రామ్ ఎంపిక దాదాపు ఖాయమని అన్నారు. తాజాగా ఈ విషయంపై కళ్యాణ్ రామ్ స్పందించాడు. 

''మొదట తేజ దర్శకత్వంలో సినిమా అన్నప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చి బయోపిక్ లో మీరొక పాత్ర చేయాలని నాకు చెప్పారు. అది ఎలాంటి పాత్ర అనే విషయం చెప్పలేదు. కానీ ఇప్పుడు బయోపిక్ సమీకరణాలు మారిపోయాయి. దర్శకుడిగా క్రిష్ వచ్చారు. మరేం జరుగుతుందో నాకు తెలియదు. నన్నైతే నటించాలని ఎవరూ అడగలేదు'' అని క్లారిటీ ఇచ్చాడు. అదన్నమాట సంగతి ఛాన్స్ వచ్చినట్లు వచ్చి పోయింది. మరి క్రిష్ ఆలోచనల్లో కళ్యాణ్ రామ్ ఉన్నదో లేదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే!