కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ 

కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ 

నందమూరి కళ్యాణ్ రామ్ త్వరలోనే పవన్ సాదినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హరి కృష్ణ, ఎన్టీఆర్ లు కీలక పాత్రలు పోషించనున్నారని గతంలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ ప్రాజెక్టు త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. తాజాగా కళ్యాణ్ రామ్ ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఇదొక మల్టీ స్టారర్ గా రూపొందనుందని తెలిపారు. 

ఈ సినిమాలో తనతో పాటు ముగ్గురు హీరోలు నటిస్తారని దీనిపై ఓ క్లారిటీ వచ్చాక, అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టును ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ సొంతంగా నిర్మించనున్నారు. గతంలో పవన్ సాదినేని తీసిన సినిమాలు ప్రేక్షకులను బాగా అలరించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పటి నుండి మంచి ఆసక్తి నెలకొంది. మరోవైపు కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన నా నువ్వే చిత్రం రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించగా, జయేంద్ర దర్శకత్వం వహించారు.