డబ్బింగ్ పనుల్లో చిరు అల్లుడు 

డబ్బింగ్ పనుల్లో చిరు అల్లుడు 

చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఇవాళ్టి నుండే కళ్యాణ్ దేవ్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను మొదలెట్టారు. ఈ సినిమా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తూనే క్రైమ్ తరహా కాన్సెప్ట్ కూడా కథలో మిళితమై ఉంటుందని సమాచారం.

ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా కెకె సెంథిల్ కుమార్ పనిచేస్తుండడం విశేషం. కళ్యాణ్ దేవ్ సరసన మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, నాజర్, సత్యం రాజేష్ వంటి నటులు పలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తుండగా, వారాహి చలన చిత్రం బ్యానర్ పై ఈ ఎంటర్ టైనర్ రూపొందుతోంది.