భద్రాద్రిలో కడియం, తుమ్మల

భద్రాద్రిలో కడియం, తుమ్మల

బద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామిని సోమవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాలు మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శమన్నారు. రైతుబంధు పథకం చాలా గొప్పవిషయం.. సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు అని పేర్కొన్నాడు. తెలంగాణలో లౌకికవాదానికి పెద్దపీట వేశామని కడియం అన్నారు.