కోట్లకు పడగలెత్తిన జర్నలిస్ట్...

కోట్లకు పడగలెత్తిన జర్నలిస్ట్...

సుమారు రూ.80  కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరపటంతో సీనియర్‌ జర్నలిస్టు ఉపేంద్రరాయ్‌ని సీబీఐ అరెస్ట్‌ చేసింది. వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన సీనియర్‌ జర్నలిస్ట్ ఉపేంద్ర రాయ్‌, ఎయిర్‌ వన్‌ ఏవియేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భద్రతా అధికారి ప్రసూన్‌ రాయ్‌ మరికొందరితో కలిసి బీసీఏఎస్‌, ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్‌ను మోసం చేశారు. తప్పుడు పత్రాలతో ఏరోడ్రోమ్‌ ఎంట్రీ పాస్‌లు పొంది దేశంలోని అన్ని విమానాశ్రయాల్లోని భద్రత ఉండే, నిషిద్ధ ప్రాంతాల్లో ప్రవేశానికి అనుమతి పొందారు. అంతేకాకుండా దేశ భద్రతకు ముప్పు కలిగించేలా వ్యవహరించారు. ఈ క్రమంలో అక్రమ డబ్బును సంపాదించాడు. ఈ  అక్రమ డబ్బు పెట్టుబడులకు కొందరు సహకరించారు. ఈ డబ్బుతో ఖరీదైన కార్లను కూడా కొన్నాడు ఉపేంద్రరాయ్‌. ఇక ఉపేంద్ర ఖాతాలో 2017లో రూ.79 కోట్లు జమైనట్లు సీబీఐ గుర్తించింది. ఐటీ శాఖ పెట్టిన కేసులను మాఫీ చేసేందుకు.. సెటిల్‌మెంట్లకుగాను పలు కంపెనీల నుంచి రూ.16 కోట్లు తీసుకున్నాడు అని సీబీఐ పేర్కొంది.