ఇంగ్లాండ్ కు మరో దెబ్బ... అప్పుడు బ్రాడ్ ఇప్పుడు ఆర్చర్

ఇంగ్లాండ్ కు మరో దెబ్బ... అప్పుడు బ్రాడ్ ఇప్పుడు ఆర్చర్

మాంచెస్టర్ వేదికగా ఈ రోజు ఇంగ్లాండ్-వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అయితే మ్యాచ్ మొదలుకాకముందే ఇంగ్లాండ్ కు ఎదురు బెబ్బ తగిలింది. అదేంటంటే... కరోనా విరామం తర్వాత  జరుగుతున్న ఈ  మొదటి అంతర్జాతీయ సిరీస్ లో ఐసీసీ విధించిన అన్ని కరోనా నియమాలను పాటించాలి. కానీ అందులో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అందులో విఫలమయ్యాడు. మాంచెస్టర్‌లో ఉన్న బయో-సేఫ్ ప్రోటోకాల్‌ను ఆర్చర్ ఉల్లంఘించాడు. అందుకే అతను ఐదు రోజుల స్వీయ నిర్బంధాన్ని పాటించాలి. ఆ తర్వాత అతనికి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు,  అందులో నెగెటివ్ గా తేలితే అతను జట్టులోకి వస్తాడు. కాబట్టి అతను ఈ రోజు నుండి ప్రారంభం కావాల్సిన టెస్ట్ మ్యాచ్ కు దూరం అవుతున్నాడు. ఇంతకముందు మొదటి మ్యాచ్ లో స్టువర్ట్ బ్రాడ్ మొదటి  దూరమవడం జట్టుపైన చాల ప్రభావం చూపించింది. మరి ఇప్పుడు  ఆర్చర్ మ్యాచ్ కు దూరంకావడం కూడా జట్టు పై ప్రభావం చూపిస్తుందా...  లేదా అనేది చూడాలి.