మొదటి టెస్ట్ నుండి రూట్ ఔట్... కెప్టెన్ గా స్టోక్స్.

మొదటి టెస్ట్ నుండి రూట్ ఔట్... కెప్టెన్ గా స్టోక్స్.

వెస్టిండీస్‌తో వచ్చే వారం సౌతాంప్టన్‌లో జరిగే తొలి టెస్టు మ్యాచ్ ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఆడటం లేదని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఎందుకంటే... ప్రస్తుతం రూట్ భార్య క్యారీ ప్రగ్నెట్... అయితే ఈ వారం చివరలో తనకు డెలివరీ అవుతుందని డాక్టర్లు చెప్పడంతో రూట్ తన భార్య తో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం అతను ఈ రోజు శిక్షణా శిబిరాన్ని వదిలి తన భార్య వద్దకు వేళనున్నాడు. అందువల్ల జూలై 8 న ప్రారంభమయ్యే మొదటి టెస్టు మ్యాచ్ లో కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని ఎదుర్కోవటానికి రూపొందించిన రూల్స్ ప్రకారం, రూట్ మళ్ళీ జట్టులో చేరాలంటే తన ఇంట్లో ఏడు రోజుల నిర్బంధంలో ఉండాలి. కాబట్టి అతను మొదటి టెస్ట్ మ్యాచ్ కు దూరం కానున్నాడు. అందువల్ల ప్రస్తుత ఇంగ్లాడ్ టెస్ట్ వైస్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలిసారి తమ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. చూడాలి మరి స్టోక్స్ తన కెప్టెన్సీ ఏ విధంగా నిర్వహిస్తాడు అనేది.