జియో చెప్పింది మ‌రో గుడ్‌న్యూస్‌.. ఇక‌, ఆ సేవ‌లు ఉచితంగా...

జియో చెప్పింది మ‌రో గుడ్‌న్యూస్‌.. ఇక‌, ఆ సేవ‌లు ఉచితంగా...

జియో త‌న వినియోగదారులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది.. వ‌రుస‌గా అంత‌ర్జాతీయ‌, దేశీయ సంస్థ‌ల‌తో జ‌ట్టుక‌డుతోన్న రిల‌య‌న్స్ సంస్థ‌.. వాటి భాగ‌స్వామ్యంతో.. త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు మ‌రిన్ని వెసులుబాట్లు క‌ల్పిస్తోంది.. తాజాగా, ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీస్ లయన్స్ గేట్ ప్లేతో ఒప్పందం కుదుర్చుకుంది జియో సంస్థ‌.. దీంతో.. జియో ఫైబర్ వినియోగదారులకు ఈ సేవలు ఉచితంగా లభించనున్నాయి. లయన్స్ గేట్ ప్లే సర్వీస్‌లో ఉండే సూపర్‌హిట్‌ హాలీవుడ్‌ సినిమాలను వినియోగదారులు జియో టీవీ ప్లస్ యాప్ ద్వారా ఉచితంగా చూసే అవ‌కాశం క‌ల్పించింది. ఈ యాప్‌ను జియో సెట్‌టాప్‌ ద్వారా వినియోగించుకోవచ్చు. అంతేకాదు.. లయన్స్ గేట్ ప్లే ప్రీమియం యాక్సెస్ కూడా ఉచితంగా లభిస్తుంది. హాలీవుడ్ సూప‌ర్ హిట్ మూవీతో పాటు అన్ని రకాల కంటెంట్ ఇందులో అందుబాటులో ఉంది. జియో ఫైబర్ సిల్వర్ లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్లలో ఉన్నవారికి ఈ ఆఫర్ అప్లికెబుల్ అవుతుంద‌ని జియో ప్ర‌క‌టించింది.. జియో ద్వారా భారతీయ వినియోగదారులకు మరింత చేరువ అవుతామని లయన్స్ గేట్ సౌత్ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ జైన్ వెల్ల‌డించారు.